
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమాకి సంబందించిన పాచ్ వర్క్ సీన్స్ షూట్ ఈ రోజుతో ముగియనుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ వారాంతం లోపు అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూస్తి కానున్న ఈ సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రేపు ఈ సినిమా తమిళ వెర్షన్ ఆడియోని చెన్నైలో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే సీనియర్ యాక్టర్ విజయ్ కుమార్ కుమారుడు అరుణ్ విజయ్ ఈ సినిమాతో తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఈ ఏడాది మొదట్లో వచ్చిన తమిళ మూవీ ఎన్నై అరింధాల్(ఎంతవాడు గాని) సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అరుణ్ విజయ్ తెలుగులో మొదటి సారిగా చేస్తున్న బ్రూస్ లీ తనకి మంచి పేరు తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాడు. అరుణ్ విజయ్ బ్రూస్ లీ గురించి మాట్లాడుతూ ‘తెలుగులో సినిమా అంటే ఓ పండుగ.. ఇక్కడ హీరోలని, నటుల్ని అభిమానించినట్లు ఇంకెక్కడా అభిమానించరు. బ్రూస్ లీ సినిమాని అన్ని కమర్షియల్ హంగులతో తీసారు. పక్కగా రామ్ చరణ్ నుంచి వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. నా పాత్రకి చాలా మంచి పేరొస్తుందని ఆశిస్తున్నానని’ అన్నాడు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్.