‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంపై సీనియర్ నటుడు జగపతి బాబు ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో తన పాత్ర గురించి స్పందిస్తూ, ‘ఈ సినిమా చాలా గ్రాండ్‌గా ఉండబోతోంది.. నా పాత్రను నేను కూడా ఊహించని విధంగా డిజైన్ చేశారు’ అంటూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాడు.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో జగపతి బాబు ప్రధాన విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. కథలో అత్యంత కీలకమైన మరియు పవర్‌ఫుల్ ఇంపాక్ట్ చూపే పాత్రలో ఆయన కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ‘పెద్ది’లో జగ్గు భాయ్ రోల్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version