దసరా కానుకగా రానా – రెజీనల మూవీ

rana-regina
‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి పెరియాదిక్ ఫిల్మ్స్ తో హిట్స్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హంక్ రానా సోలో హీరోగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ కి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘యమదొంగ’ సినిమాలో ఎన్.టి.ఆర్ చేత నాచోరే నాచోరే సాంగ్ కి థియేటర్ దద్దరిల్లిపోయేలా స్టెప్స్ వేయించిన డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రానా. ప్రేమ్ రక్షిత్ రానా కోసం ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కథని సిద్దం చేసాడని ఇది వరకే తెలియజేశాం.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి అందరి నుంచీ గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. దసరా కానుకగా ఈ సినిమాని లాంచ్ చేసి వెనతెన్ సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేసారు. బాహుబలి 2 మొదలు పెట్టడానికి రానాకి 3 నెలల గ్యాప్ ఉంది. ఆ తిమేలోపే ఈ సినిమాని ఫినిష్ చేయనున్నారు. సురేష్ బాబు నిర్మించనున్న ఈ సినిమాలో రానా సరసన రెజీన కసాండ్ర ని హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటి వరకూ తన డాన్స్ లతో మెప్పించిన ప్రేమ్ రక్షిత్ డైరెక్టర్ గా ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి.

Exit mobile version