ప్చ్.. బోసిపోతున్న సమ్మర్ బాక్సాఫీస్ !

సినిమాలకు ‘సమ్మర్’ చాలా మంచి సీజన్. టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత ఇదే అతి పెద్ద సీజన్ కూడా. అలాంటి ‘సమ్మర్’ ఇప్పుడు వృధాగా పోతుందని సినిమా లవర్స్ బాధ పడుతున్నారు. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీస్ తో సహా అందరూ కలిసి సినిమాలు చూడటానికి థియేటర్లకు వస్తారు. కానీ, థియేటర్స్ లో ఇప్పటివరకు ఆకట్టుకునే సినిమాలు రాలేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ బోసిపోతోంది. ప్రేక్షకులతో కళకళలాడే సినిమా హాళ్లు, ఇప్పుడు జనాలు లేక వెలవెలబోతున్నాయి. నిజానికి 2026 సమ్మర్ బాక్సాఫీస్ దగ్గర ప్రతి వారం నాలుగైదు సినిమాలొస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఏ సినిమా నిలబడలేదు.

మార్చి నెలాఖరున వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిరాశ పరిచింది. ఆ తర్వాత వచ్చిన బ్యాడ్ బాయ్ కార్తీక్, పాపం ప్రతాప్, గేదెలరాజు కాకినాడ తాలూకా, గాయపడ్డ సింహం, జెట్లీ వంటి సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. కొంచెంలో కొంత బైకర్, రాకాసా, డెకాయిట్, తిమ్మరాజుపల్లి టీవీ లాంటి చిత్రాలు బాగానే ఉన్నా.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేదు.ఇటీవల కాలంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. చివరకు సమ్మర్ లో కూడా జనం సినిమాల కోసం థియేటర్స్ కి వెళ్లకపోతే.. ఓ మోస్తరు సినిమాలు ఆడటం ఇక కష్టమే.

Exit mobile version