బాహుబలిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన సూర్య

surya
తెలుగు తో పాటు తమిళంలో కూడా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సూర్య. త్వరలో సూర్య నటించిన పసంగా 2 సినిమా తెలుగులో మేము గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే బాహుబలి రిలీజ్ అయిన టైంలో ఎస్ఎస్ రాజమౌళి ‘బాహుబలి 2’లో సూర్య ఓ ప్రముఖ పాత్రలో కనిపించనున్నాడు అనే వార్తలు వచ్చాయి. అప్పట్లో ‘అసలు ఇవన్నీ బేస్ లెస్ రూమర్స్. ఇప్పటి వరకూ అలాంటి ఆఫర్ ఏమీ రాలేదు. చెప్పాలి అంటే ఈ సినిమాలో కోరికగా ఉంది. ఈ మీడియా ద్వారా రాజమౌళి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక చిన్న రోల్ ఇచ్చిన నేను చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని’ చెప్పి ఆ రూమర్స్ కి బ్రేక్ చేసాడు.

అప్పుడు ఆ వార్తలు సద్దు మనిగినా ఇప్పుడు మళ్ళీ అదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సూర్య బాహుబలి 2 లో ఓ రోల్ కోసం అప్రోచ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకి కూడా సూర్య మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ‘బాహుబలి నిర్మాతలు సెకండ్ పార్ట్ కోసం నన్ను అస్సలు అప్రోచ్ అవ్వలేదు. ఇప్పటి వరకూ నాకు బాహుబలి అనే సినిమాకి సంబంధం లేదు. ఒకవేళ ఫ్యూచర్ లో అప్రోచ్ అయితే చేయడానికి సిద్దం’ అని తెలుపాడు సూర్య. సూర్య ప్రాసతుతం 24 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Exit mobile version