మలేషియాకి షిఫ్ట్ అయిన రజినీకాంత్

kabali
‘లింగ’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘కబాలి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఒకప్పటి రియల్ లైఫ్ మాఫియ డాన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ తన వయసుకు తగ్గా పాత్రలోనే చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడు. గత కొద్ది రోజులుగా చెన్నైలో శరవేగంగా షూటింగ్ చేసిన ఈ చిత్ర టీం చెన్నైలో ఓ మేజర్ షెడ్యూల్ ని ఫినిష్ చేసారు.

చెన్నై షెడ్యూల్ అయ్యాక ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఈ చిత్ర టీం మలేషియా వెళ్ళింది. నేటి నుంచి మలేషియాలో షూటింగ్ ని ప్రారంభించారు. అలాగే అక్కడ ప్రస్తుతం ఫైటర్స్ తో రజినీకాంత్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. మలేషియా షెడ్యూల్ తో ఈ సినిమా షూట్ దాదాపు పూర్తవుతుంది. సౌత్ చెన్నైలోని ఓ రియల్ లైఫ్ మాఫియా డాన్ పాత్రని స్పూర్తిగా తీసుకున్న ఈ సినిమాలో రజినీకాంత్ కబాలీశ్వరస్ అనే పాత్రలో కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాకి తమిళ్లో ‘కబాలి’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసారు. రజినీకాంత్ సరసన రాధిక ఆప్టేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జెడి చక్రవర్తి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పిఎ రంజిత్ ఈ సినిమాకి డైరెక్టర్.

Exit mobile version