
2007 లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత పలు సినిమాలతో విజయాలను అందుకున్న వరుణ్ సందేశ్ రీసెంట్ టైమ్స్ లో సరైన హిట్ లేక కాస్త స్లోగా సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే వరుణ్ సందేశ్ తన లైఫ్ పార్టనర్ దొరికేసిందట. త్వరలోనే పెళ్ళికి కూడా సిద్దమవుతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని వరుణ్ సందేశ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఖరారు చేసింది. ఇంతకీ వరుణ్ సందేశ్ మెచ్చిన అమ్మాయి కూడా హీరోయిన్ కావడం విశేషం.
ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో హర్ష వర్ధన్ రాణేకి జోడీగా కనిపించిన అమ్మాయి వితిక షేరు. ప్రస్తుతం పలు తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్న ఈ భామ వరుణ్ సందేశ్ తో కలిసి పడ్డానండి ప్రేమలో మరి సినిమా చేసింది. ఈ సినిమా చేసినప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు వీరి ఇరువురి ఫ్యామిలీస్ పెళ్ళికి అంగీకరించడంతో పెళ్ళికి సిద్దమైనట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ అధికారికంగా అనౌన్స్ చేయనున్నాడు.