‘కంచె’ యూఎస్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్!

kanche
సగటు తెలుగు సినీ అభిమానికి గత కొద్దికాలంగా ఎంతో ఆసక్తికరంగా కనిపించిన క్రేజీ సినిమా ‘కంచె’. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే పాజిటివ్ వైబ్రేషన్‌ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి సినిమాలతో తెలుగులో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు క్రిష్ తాజాగా ‘కంచె’ సినిమానూ తనదైన బ్రాండ్‌తో రెండో ప్రపంచయుద్ధ నేపథ్యానికి ఓ ప్రేమకథను జోడించి క్రిష్ తెరకెక్కించారు. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదల నాటి నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రానటువంటి నేపథ్యమున్న కథతో వచ్చిన కంచె సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్స్ పరంగానూ సత్తా చాటుతోంది. ఏపీ, తెలంగాణాల్లో మంచి కలెక్షన్స్‌తో వెళుతోన్న ఈ సినిమా, అమెరికాలో సూపర్ కలెక్షన్స్ వసూలు చేసింది. మొదటి వారాంతం ముగిసే సరికి ఈ సినిమా అమెరికాలో 388k డాలర్లు వసూలు చేసి స్టడీగా నిలబడింది. ఇండియన్ రూపాయల్లో ఈ మొత్తం 2.5కోట్ల రూపాయలు. ఈ సినిమాకు అమెరికాలో రిలీజ్‌కు ముందు జరిగిన బిజినెస్‌తో పోల్చి చూస్తే ఈ కలెక్షన్స్ కంచె టీమ్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చే కలెక్షన్స్‌గానే చెప్పుకోవచ్చు.

Exit mobile version