
టైటిల్ ఏమో సాఫ్ట్ గా ‘హరికథ’ అని పెట్టారు కానీ మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ మాత్రం బాగా వయోలెంట్ గా మారి తన మీదకి వచ్చిన రౌడీలను చితకబాడుతున్నాడు. అసలు ఏంటా విషయం అని కునుక్కుంటే.. ఏదో సీరియస్ పని మీద రామ్ వెళ్తున్నాడు, కట్ చేస్తే అతని మీద విలన్స్ బాచ్ అటాక్ చేయడంతో వాళ్ళ పని పడుతున్నాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కి కిషొర్ తిరుమల దర్శకత్వం వహిస్తుంటే, పీటర్ హెయిన్స్ ఈ యాక్షన్ ఎపిసోడ్ ని కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ ఎయిర్ పోర్ట్ రోడ్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు.
శివమ్ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన రామ్ ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని సినిమా విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. డిసెంబర్ మిడిల్ కల్లా ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసి న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. తండ్రి – కుమార్తెల మధ్య ప్రేమాను బంధాలకి పెద్దపీట వేస్తూ చేసిన హరికథ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. స్రవంతి రవికిషోర్ నిర్మాత.