మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్ర ట్రైలర్‌ను మే 18న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను నార్త్ బెల్ట్‌లోనూ గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర హిందీ ట్రైలర్‌ను మే 18న ముంబైలో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా చిత్ర బృందం ప్రమోషన్లు వేగవంతం చేసింది.
ముంబై ఈవెంట్‌తో పాటు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో ఒక భారీ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని ఒక ప్రత్యేక గీతాన్ని అక్కడ చిత్ర యూనిట్ సమక్షంలో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. నార్త్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, భోపాల్ వేదికగా నిర్వహించే ఈ కార్యక్రమం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
