మరోసారి ఐటమ్ సాంగ్లో మిల్క్ బ్యూటీ

Tamannaah
ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా వెలుగొందుతూ తెలుగు, తమిళ స్టార్ హీరోస్ సరసన సినిమాలు చేస్తున్న హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా. ఈ ఏడాది బాహుబలి లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న తమన్నా త్వరలోనే బెంగాల్ టైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా సినిమాలను పక్కన పెడితే.. తమన్నా కెరీర్లో ఇప్పటి వరకూ ఒకే ఒక్క ఐటమ్ సాంగ్ చేసింది.. ఆ సినిమానే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతూ చేసిన ‘అల్లుడు శీను’.

ఆ తర్వాత స్పెషల్ సాంగ్ చేయడానికి కాస్త దూరంగా ఉన్న తమన్నా మరోసారి ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్దమైంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే తమన్నా రెండవసారి కూడా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలోనే ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. భీమనేని శ్రీనివాస్ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రెనివాస్ తన రెండవ సినిమా చేస్తున్నాడు. సుందర పాండ్యన్ అనే తమిళ మూవీకి రీమేక్ గా వస్తున్నా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం తమన్నాని అప్రోచ్ అయ్యారు, అలాగే తను అడిగిన భారీ అమౌంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడడంతో తమన్నా కూడా ఈ ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే శ్రీనివాస్ – తమన్నాలపై ఈ పాటని షూట్ చేయనున్నారు.

Exit mobile version