‘సైజ్ జీరో’ ఆడియో లాంచ్ కి రానున్న స్టార్స్ వీళ్ళే.!

size-zero-audio-rajmouli
బాహుబలి, రుద్రమదేవి లాంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ తర్వాత యోగ బ్యూటీ అనుష్క నుంచి రానున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘సైజ్ జీరో’. ఈ సినిమా కోసం అనుష్క తన పిజికల్ లుక్ ని పూర్తిగా మార్చుకొని 20 కేజీలు బరువు పెరిగి మరీ చేసిన ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం రేపు సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సైజ్ జీరో ఆడియోకి ముఖ్య అతిధిగా బాహుబలి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి హాజరు కానున్నాడు.

రాజమౌళితో పాటు యంగ్ రెబల్ స్టార్ కూడా ఈ వేడుకకి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. అంతే కాకుండా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, స్టార్ దర్శకులు సైజ్ జీరో ఆడియో లాంచ్ కి హాజరు కానున్నారు. అనుష్కతో పాటు ఈ సినిమాలో ఆర్య, సోనాల్ చౌహాన్ లు ముఖ్య పాత్రలు పోషించారు. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు. ఇటీవలే తమిళంలో రిలీజ్ అయిన ఈ చిత్ర ఆల్బమ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పివిపి బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా నవంబర్ 27న రిలీజ్ కానుంది.

Exit mobile version