అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ నెంబర్ 1 అవుతాడా.?

Akhil
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోస్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు అంటే వాళ్ళకి ఎక్కువగా రొమాంటిక్ హీరోస్ నే ముద్ర పడిపోతుంది. దానికి కారణం వాళ్ళు హాన్డ్సం లుక్స్ తో ఆకట్టుకోవడమే. నాగార్జున యాక్షన్ ఎంటర్టైనర్స్ చేసినప్పటికీ రొమాంటిక్ హీరోగానే గుర్తింపు ఉంది. అలాగే నాగ చైతన్యకి కూడా అదే ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి పరిచయం అవుతున్న మూడవతరం హీరో అఖిల్ అక్కినేని కూడా లుక్స్ పరంగా రొమాంటిక్ హీరోలానే ఉన్నాడు అని అనిపించుకున్నాడు.

కానీ తను మాత్రం ఆ రొమాంటిక్ హీరో అనే ఇమేజ్ రాకుండా ఉండడం కోసం మొదటి సినిమాని పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ‘అఖిల్’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 11న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే అఖిల్ తన ట్రైలర్ మరియు సాంగ్ టీజర్స్ లో తన యాక్షన్ స్టంట్స్, డాన్సులతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు. ఇది చూసిన అందరూ అఖిల్ అక్కినేని ఫ్యామిలీలో మొదటి యాక్షన్ హీరోగా టాప్ ప్లేస్ కొట్టేస్తాడని రిలీజ్ కి ముందే కితాబులిస్తున్నారు. మరి అఖిల్ అక్కినేని ఫ్యామిలీ నెంబర్ 1 హీరో అనిపించుకుంటాడా లేదా అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే..

Exit mobile version