గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ‘అఖిల్’!

akhil

అక్కినేని వంశంలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీకి ‘అఖిల్’ సినిమా ద్వారా అక్కినేని అఖిల్ సిద్ధమైన విషయం తెలిసిందే. దసరా కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా అప్పట్లో కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడి ఎట్టకేలకు దీపావళి కానుకగా పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రేపు (నవంబర్ 11న) భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక సినిమా విడుదలకు ఇంకా మరికొద్ది గంటలే ఉండడంతో అక్కినేని అభిమానులు ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి మొదలుపెట్టేశారు.

హైద్రాబాద్‌లో ఉదయం 4 గంటలకు మొదలయ్యే అఖిల్ బెనిఫిట్ షోతో అఖిల్ సినిమా హడావుడి మొదలుకానుంది. ఈ షోస్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి కాగా, అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరో అఖిల్, నితిన్, వీవీ వినాయక్ అంతా ఈ సినిమా విజయంపై ధీమాగా ఉన్నారు. ఇప్పటికే లుక్స్ పరంగా డ్యాన్సుల పరంగా అభిమానులను బాగా ఆకట్టుకున్న అఖిల్‌కు మొదటి సినిమానే ఈ స్థాయి క్రేజ్ రావడం విశేషంగానే చెప్పుకోవచ్చు. ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే దీపావళి సీజన్‌కు సోలో రిలీజ్‌తో సిద్ధమవ్వడం అఖిల్‌కు కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది.

Exit mobile version