
రామోజీ బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యాలని స్టార్ చేసిన మీ టీవీ అయిన ఈ టీవీ గత 20 ఏళ్ళుగా తెలుగువాని మెప్పిస్తూనే ఉంది. ఈ టీవీ 20 ఏళ్ళ రన్ తర్వాత రామోజీరావు ఈ టీవీ అనే బ్రాండ్ తో మరో నాలుగు ఛానల్స్ లాంచ్ చేయనున్నాడని ఇది వరకే తెలియజేశాం. ఆ ఛానల్స్ పేర్లే.. ‘ఈ టీవీ ప్లస్’, ‘ఈ టీవీ లైఫ్’, ‘ఈ టీవీ అభిరుచి’ మరియు ‘ఈ టీవీ సినిమా’. ఈ నాలుగు ఛానల్స్ ని రామోజీ రావు రేపు మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు మొదలు పెట్టనున్నారు. ఇందులో ఈ టీవీ ప్లస్ అనేది చాలా స్పెషల్ ఛానల్.. ఎలా అంటే.. ఇప్పటి వరకూ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఛానల్ అనేది ఏ భాషలోనూ లేదు. ఇందులో సినిమాలకి సంబందించిన కామెడీ క్లిప్స్ ఉండవు. కేవలం స్టార్ కమెడియన్స్ చేసిన రియాలిటీ కామెడీ షౌస్ మాత్రమే ఉంటాయి.
ఈ టీవీ ప్లస్ స్టార్ట్ కాగానే సంథింగ్ స్పెషల్ అనిపించుకునేలా మూడు గంటల పాటు ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసారు. ఆ ప్రోగ్రామ్ పేరు ‘కేరింత’, దీనికి ట్యాగ్ లైన్ ‘సెలబ్రేషన్ అఫ్ కామెడీ’. ఈ టీవీలో మిమ్మల్ని అంత్యంత ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, క్యాష్, ఢీ సీరీస్, స్టార్ మహిళ, జీన్స్ లాంటి షోలని అందించిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు రూపొందించిన స్పెషల్ కార్యక్రమమే ఈ ‘కేరింత’. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రియాలిటీ షోస్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ పెట్టి టాలీవుడ్ లోని స్టార్ కమెడియన్స్, సింగర్స్ ని, డాన్సర్స్ ని ఒకే స్టేజ్ పైకి తీసుకొచ్చి చేసిన షో ‘కేరింత’. ఈ టీవీ ప్లస్ లో మొట్ట మొదటగా ప్రసారమయ్యే ఈ ‘కేరింత’ షోలో ఉన్న స్పెషల్ అట్రాక్షన్ ఎంటనేవి ప్రత్యేకంగా మీకందిస్తున్నాం..
–> కామెడీ కింగ్ బ్రహ్మానందం ‘కేరింత’ షోకి రావడమే కాకుండా కొంతసేపు హోస్ట్ గా కూడా వ్యవహరించి, మధ్య మధ్యలో తన మార్క్ డాన్సులతో ఆకట్టుకున్నాడు.
–> పంచ్ లకు కేరాఫ్ అడ్రస్ అయిన కమెడియన్ కృష్ణ భగవాన్ తన టీంతో కలిసి ఓ స్కిట్ తో నవ్వించనున్నాడు.
–> రాయలసీమ యాసలో రచ్చ చేసే కమెడియన్ జయప్రకాశ్ రెడ్డి కూడా ఓ కామెడీ స్కిట్ తో అలరించనున్నాడు.
–> నటి హేమ మరియు జోష్ రవిలు కూడా చెరొక స్కిట్ తో నవ్వించనున్నారు.
–> యాక్టర్ కౌశిక్ మరియు గౌతమ్ రాజు కూడా కామెడీ స్కిట్స్ తో రెడీ అయ్యారు.
–> సింగర్స్ అయిన రేవంత్, కృష్ణ చైతన్య, ప్రియాంక, అంజు, సౌమ్యలు మధ్య మధ్యలో పాటలతో ఎంటర్టైన్ చేస్తే వాటి మధ్యలో కొన్ని డాన్స్ పెర్ఫార్మన్స్ లు కూడా ఉన్నాయి.
–> ఈ కేరింత ప్రోగ్రామ్ కి రేష్మి – రవి యాంకర్స్ గా వ్యవహరిస్తే నాగబాబు, రోజాలు జడ్జ్ లుగా వ్యవహరిస్తారు. వీరందరితో పాటు జబర్దస్త్ కమెడియన్స్ కూడా కలిసి సందడి చేసారు.
సో ఇంతమంది కలిసి చేసే రచ్చ రంబోలాని ఎంజాయ్ చేయాలంటే రేపు మధ్యాహ్నం ఈ టీవీ ప్లస్ లాంచ్ కాగానే మొదట ప్రసారమయ్యే ‘కేరింత’ షో చూడాల్సిందే..