సునీల్ ‘కృష్ణాష్టమి’ ఆడియో రిలీజ్ డేట్

Krishnashtami
కమెడియన్ నుంచి కామెడీ హీరోగా మారి, ఆ తర్వాత తన లుక్ మరియు పర్సనాలిటీని కూడా మార్చుకొని యాక్షన్ హీరోగా మారిన స్టార్ సునీల్. ‘భీమవరం బుల్లోడు’ సినిమా తర్వాత సునీల్ బాగా గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ‘కృష్ణాష్టమి’. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి ‘జోష్’ ఫేం వాసు వర్మ డైరెక్టర్. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాని సంక్ర్నతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ సిద్దమైందని తెలియజేశాం. సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్ర టీం తాజాగా ఆడియో రిలీజ్ డేట్ ని కూడా ఫైనలైజ్ చేసింది. ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 27న ఆడియోని రిలీజ్ చేయడానికి నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. దినేష్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సునీల్ సరసన నిక్కీ గాల్రాని, డింపుల్ చోపడే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. సునీల్ ఈ సినిమా సక్సెస్ పై చాలా ఆశలే పెట్టుకొని ఉన్నాడు.

Exit mobile version