
భారీ బడ్జెట్ ఫిల్మ్స్ అయిన ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాలతో ఈ ఏడాది బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్ కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్స్ అందుకున్న యోగ బ్యూటీ అనుష్క నుంచి రానున్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘సైజ్ జీరో’. తమిళ స్టార్ ఆర్య హీరోగా నటించిన ఈ సినిమాలోని లావు అమ్మాయి పాత్ర కోసం అనుష్క 20 కేజీల బరువు పెరిగింది. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.
రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఈ చిత్ర టీం భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయడానికి వ్యూహరచనని సిద్దం చేసుకుంది. ముఖ్యంగా ఈ చితర్ టీం యుఎస్ లో ప్రీ రిలీజ్ ప్రమోషన్ ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. ఎక్కువ భాగం ఈ చిత్ర టీం అక్కడికి వెళ్లి ప్రమోషన్స్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్స్ ద్వారా పాజిటివ్ టాక్ ఉన్న ఈ సినిమాకి అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో స్టార్స్ అయిన నాగార్జున, రానా రాగ్గుబాటి, రంగం ఫేం జీవ, తమన్నా, కాజల్ అగర్వాల్, హన్సిక, లక్ష్మీ మంచు, శ్రీ దివ్య, రేవతిలు అతిధి పాత్రల్లో కనిపించి కనువిందు చేయనున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.