మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమా పెద్ది ప్రమోషన్స్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఊపందుకున్నాయి. వరుసగా ముంబై భోపాల్ లలో గ్రాండ్ ఈవెంట్స్ ని మేకర్స్ చేస్తుండగా ఈ మే 23న పెద్ది స్పెషల్ సాంగ్ ని భోపాల్ లో విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు.
అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటనే భోపాల్ లో సాంగ్ తాలూకా ప్రోమో మాత్రం విడుదల చేస్తారని తెలుస్తుంది. కానీ మ్యూజికల్ ఈవెంట్ గా రెహమాన్ లైవ్ పెర్ఫామెన్స్ తో హంగామా మాత్రం గ్రాండ్ ఉంటుంది అని టాక్. మరి ఫుల్ సాంగ్ విషయానికి వస్తే దీనిని హైదరాబాద్ లో మరో గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేయొచ్చని టాక్ వినిపిస్తుంది. సో ఈ స్పెషల్ సాంగ్ భోపాల్ ఈవెంట్ పై అందరికీ ఇదొక క్లారిటీ అని గుర్తుంచుకోవాలి. ఇక ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా ఈ జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కాబోతుంది.
