‘ఐఫా ఉత్సవం’కి హోస్ట్ గా అల్లు శిరీష్

Allu-Sirish
ఇండియాలో ప్రతి ఏడాది చాలా గ్రాండ్ గా జరిగే చలన చిత్ర అవార్డ్స్ వేడుకల్లో ఐఫా(ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డ్స్ వేడుక చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటి వరకూ ఈ వేడుకని కేవలం బాలీవుడ్ లో మాత్రమే జరిగేది. కానీ మొదటి సారి ఐఫా వారు సౌత్ ఇండియన్ సినిమాని కూడా రేప్రజేస్ట్ చేస్తూ ఫస్ట్ సౌత్ ఇండియన్ ఐఫా అవర్ద్స్ వేడుకని నిర్వహించనున్నారు. అందులో భాగంగానే ఈ నెల మొదట్లో అధికారికంగా ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్ నిర్వహించి అనౌన్స్ చేసారు.

ఈ వేడుకకి కమల్ హాసన్, నాగార్జున, వెంకటేష్, తమన్నా, రానాలతో పాటు పలువురు స్టార్స్ హాజరయ్యాడు. మొదటి సౌత్ షోకి ‘ఐఫా ఉత్సవమ్’ అనే పేరుని పెట్టారు. ఇంకా డేట్ ఫైనల్ చేయలేదు కానీ డిసెంబర్ మొదటి వారంలో ఐఫా ఉత్సవం వేడుక హైదరాబాద్ లో ఉంటుంది. తాజాగా ఐఫా ఉత్సవమ్ వేడుకలో తెలుగు కేటగిరీకి హోస్ట్ గా నిర్వహించే బాధ్యతని అల్లు వారి అబ్బాయి, అల్లు అర్జున్ బ్రదర్ అయిన అల్లు శిరీష్ తీసుకున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఉండడమే కాకుండా ఈ ఐఫా ఉత్సవమ్ ని ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నానని అల్లు శిరీష్ తెలియజేశాడు. ఈ వేడుక పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

Exit mobile version