
టిపికల్ అండ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కలం నుంచి వచ్చిన ప్రేమకథే ‘కుమారి 21F’. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైనర్’గా యువతని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొదటి షో నుంచే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడం, అది స్ప్రెడ్ అవ్వడం మరియు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంశలే రావడంతో మొదటి రోజు సూపర్బ్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుకుమార్ కథ – స్క్రీన్ ప్లేని అందిస్తూ నిర్మాతగా మారి చేసిన ఈ మొదటి సినిమాకి తన అసిస్టెంట్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు.
కుమారి 21F ద్వారా చెప్పిన ఓ బోల్డ్ పాయింట్ ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అని ఈ చిత్ర టీం కాస్త టెన్షన్ పడ్డారు. కానీ ఆ పాయింట్ ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న విధానం, సినిమాకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ మరియు కలెక్షన్స్ చూసి సుకుమార్ అండ్ టీం చాలా థ్రిల్ ఫీలవుతున్నారు. ముఖ్యంగా సుకుమార్ సెకండాఫ్ లో జస్టిఫై చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో రాజ్ తరుణ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. హేభ పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ అయిన దేవీశ్రీ ప్రసాద్, రత్నవేలు పనిచేసారు.