సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్ సరసన హీరోయిన్‌గా సమంత నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఇందులో పూజా హెగ్డే ప్రత్యేక పాటలో అలరించబోతోంది. దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి సమీపంలో జరుగుతోంది.
ఆది పినిశెట్టి ఈ సినిమాలో చరణ్ కు బ్రదర్ పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా ముఖ్యంగా అన్నా, తమ్ముళ్ళ మద్య అనుభందాన్ని ఎక్కువగా ఎలివేట్ చేసేలా ఉంటుందని సమాచారం. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఎలా ఉంటారు, వారి మధ్యన బంధం ఏవిధంగా ఉండబోతోంది అనే అంశాలు ఈ సినిమాలో సుకుమార్ కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగిందని టాక్. టీజర్ విడుదల తరువాత సినిమాపై అంచానాలు కూడా భారీగా పెరిగాయి.
