మరో హీరో దర్శకుడిగా మారబోతున్నాడు !

హీరోలు దర్శకులుగా మారిన సందర్భాలు మనం చాలా చూశాం. ధనుష్, శింబు వంటి హీరోలు తమ సినిమాలకు తామే దర్శకత్వం వహించారు. త్వరలో తెలుగులో సాయి రామ్ శంకర్ కూడా తన కొత్త సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. అదే కోవలోకి మరో తెలుగు హీరో చేరబోతున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే…

హీరో మంచు విష్ణు త్వరలో దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విష్ణునే హీరోగా నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం విడుదల తరువాత విష్ణు దర్శకత్వం వహించే సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Exit mobile version