నాగ చైతన్య, మారుతిల కాంబినేషన్లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోపిసుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందనుంది. అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
మారుతి తన సినిమాల్లో హీరోలకు డిఫరెంట్ రోల్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ సినిమాలో కూడ నాగ చైతన్యను ఇగోయిస్ట్ పాత్రలో చూపించబోతున్నాడట. ఈ మూవీలో దాసరి అరుణ్ కుమార్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ‘ఒక్కక్షణం’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన అరుణ్ ఈ సినిమాలో మరో మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని సమాచారం. ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉంది.
