వివాదాల్లో చిక్కుకున్న క్రిష్ సినిమా !

తెలుగు దర్శకుల్లో దర్శకుడు క్రిష్ ది విభిన్నమైన శైలి. కమర్షియల్ వాల్యూస్ మధ్యన కూడా సినిమాకు సహజత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నించే దర్శకుడాయన. అందుకే అందరిలోనూ ఆయన కాస్త ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్రస్తుతం ఆయన ఘాన్సీ రాణి లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా ‘మణికర్ణిక’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లక్ష్మీ భాయి పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రంలో రాణీ లక్ష్మీ భాయికి, బ్రిటిష్ వ్యక్తికి మధ్యన ప్రేమ అనే అంశాన్ని చూపుతూ ఆమె గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, ఈ చిత్రాన్ని బ్రిటిష్ రచయిత రాసిన పుస్తకం ఆధారంగా రూపొందిస్తున్నారని సర్వ బ్రాహ్మణ మహాసభ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేగాక చిత్ర నిర్మాత కమల్ జైన్ కు కూడా ఈ విషయాన్ని తెలిపి చరిత్ర వక్రీకరణకు గురికాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మరి సినిమా విడుదల నాటికి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

Exit mobile version