అల్లరి నరేష్ , బీమినేని శ్రీనివాస్ కాంబినేషన్ లో రెండో సినిమా షూటింగ్ ప్రస్తుతం వరంగల్ ప్రాంతంలో శరవేగంగా జరుగుతోంది. శ్రీ వసంత్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. రంగుల రాట్నం సినిమా హీరోయిన్ చిత్ర శుక్ల ఈ మూవీ లో అల్లరినరేష్ సరసన నటిస్తోంది. సునీల్ ఈ సినిమాలో అల్లరి నరేష్ ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతున్నాడు.
తెలుగు చిత్ర సీమలో ఉన్న ప్రముఖ హాస్య నటీ,నటులందరు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ ఈ నెల 15 నుండి జరగబోతోంది. ఈ సినిమా తరువాత అల్లరి నరేష్ మరో చిత్రాల్లో నటించబోతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలను త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు.
