మహానుభావుడు లాంటి మంచి హిట్ తరువాత మారుతి ప్రస్తుతం నాగ చైతన్య తో సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రారంభం అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలో జరుగుతోంది. కాలేజీ నేపద్యంలో జరిగే ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మారుతి. అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ సినిమాలో పాపులర్ కమెడియన్ వెన్నెల కిశోర్ హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తున్నాడు. చాలా సినిమాల్లో వెన్నెల కిషోర్ నటించినప్పటికీ ఈ సినిమాలో తన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందని సమాచారం. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
