హీరో నారా రోహిత్ ప్రస్తుతం ‘ఆటగాళ్లు’ సినిమా షూటింగ్లో ఉన్నారు. పరుచూరి మురళీ దర్శకత్వంలో రూపొందుతునున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఈ చిత్రంలో రోహిత్ సరసన హీరోయిన్ గా బెంగాలీ నటి దర్శన బానిక్ ను సెలెక్ట్ చేశారట.
ఇప్పటికే ఆమె తన పాత్ర తాలూకు షూటింగ్ కూడ మొదలుపెట్టింది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కూడ ఒక కీలక పాత్రలో కనిపిస్తుండటం విశేషం. సాయి కార్తిక్ సంగీతం అందిస్తునాం ఈ చిత్రానికి మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ చేయనున్నారు.
