మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యబోతున్న వార్త కొంతకాలం క్రిందట బాగా ప్రచారం అయ్యింది. ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నట్లు న్యూస్ వచ్చింది. కానీపవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అయ్యి రాజకీయాలకు దగ్గరయ్యారు. సంతోష్ శ్రీనివాస్ గతంలో పవన్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేసిన కథలో వేరే హీరో చేస్తాడని వినిస్తోంది.
తాజా సమాచారం మేరకు ఈ సబ్జెక్టు కు నాని సెట్ అవుతాడని భావించిన దర్శకుడు నానిని సంప్రదించడం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం నాని కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తీ అయ్యాక సంతోష్ శ్రీనివాస్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో నాని సినిమా చెయ్యాలి కాని కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా మొదలుకాలేదు. సంతోష్ శ్రీనివాస్ సినిమా న్యూస్ త్వరలో ఆఫీసియల్ కానుందని వినికిడి.
