కలిసి పనిచేయనున్న సమంత, నాగ చైతన్య !

బ్యూటిఫుల్ కపుల్ నాగ చైతన్య, సమంతలు కలిసి ఒక సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా చాలా కాలం తర్వాత చై, సమంతలు కలిసి నటించనుండటంతో మొదలుకాకముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. కథ పట్ల చాలా ఎగ్జైట్ అయిన చై, సమంతలు కూడ త్వరలో సినిమా పనుల్ని మొదలుపెట్టారు.

ఇక ట్విట్టర్ ద్వారా చైతన్య మాట్లాడుతూ ‘ఈరోజు ఖచ్చితంగా కొత్త రోజు. సమంతతో కలిసి వర్క్ చేయడానికి వెళ్తున్నాను’ అన్నారు. అయితే ఈ వర్క్ సినిమా కోసం కాదు.. ఒక కమర్షియల్ యాడ్ కోసం. పెళ్లైన తరవాత చైతు, సమంతలు కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
ఇకపోతే వీరిద్దరి కొత్త సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తుండగా ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేయనున్నారు.

Exit mobile version