విడుదలకు సిద్దమైన ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ !


నటుడు నందు ప్రధాన పాత్రలో దర్శకుడు వరప్రసాద్.వరికూటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంట్లో ఎన్నెన్ని వింతలో’. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 6న విడుదలకానుంది. ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాను శ్రీకాంత్ రెడ్డి, రామమోహనరావు ఇప్పిలి సంయుక్తంగా నిర్మించారు.

పూజా రామచంద్రన్, గగన్ విహారి, కృష్ణ తేజ, ఆర్కే, సౌమ్య వేణుగోపాల్, మీనా, దువ్వాసి మోహన్ వంటి నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి చోటా. కె. ప్రసాద్ ఎడిటింగ్ భాద్యతలు నిర్వహించగా యాజమాన్య సంగీతం అందించారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఎవరూ చెప్పని రీతిలో భిన్నమైన లవ్ స్టోరీ ఈ చిత్రంలో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

Exit mobile version