అవసరమైతే ఐపిఎల్ ను అడ్డుకుంటాం: రజినీకాంత్

తమిళనాడులో కావేరీ నది జలాల వివాదం మొన్నటి వరకు చాలా నెమ్మదిగా సాగింది. అయితే ఇప్పుడు కోలీవుడ్ నటీనటులు చొరవ తీసుకోవడంతో వివాదం ఒక్కసారిగా ఉదృత రూపం దాల్చింది. అగ్రతారలు మొత్తం దిగి వచ్చి నిరసనలకు దిగారు. కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును వెంటనే ఏర్పాటుచేయాలని డిమాంద్ చేశారు. కమల్ హాసన్ – విజయ్ అలాగే నడిగర్‌ సంఘం అధ్యక్షుడు విశాల్‌, విక్రమ్ తో పాటు రజనీకాంత్‌, ఇళయరాజా వంటి ప్రముఖులు నిరసనలో పాల్గొన్నారు.

వళ్లువర్ కొట్టం ప్రాంతంలో నిరసనలు చేపట్టడం ఇప్పుడు తమిళనాట చర్చనీయంగా మరింది. ఈ వివాదంపై రజినీకాంత్ మీడియా ద్వారా ఒక విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒక విన్నపం అంటూ.. ఐపీఎల్‌ లో మ్యాచ్ ఆడేటప్పుడు చెన్నై జట్టు సభ్యులంతా నలుపు రంగు బ్యాండ్‌లు కట్టుకోని చెన్నైకు సపోర్ట్ గా నిలవాలని రజినీకాంత్ కోరారు. అందువల్ల కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుకు కోసం తమిళనాడు చేస్తోన్న పోరాటం దేశవ్యాప్తంగా అందరికి తెలుస్తుందని చెప్పారు. అంతే కాకుండా వీలైనంత త్వరగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ.. ముందు ముందు పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని చెప్పారు. అవసరమైతే ఐపీఎల్ మ్యాచ్ లను చెన్నై లో అడ్డుకుంటామని, రైతుల కష్టం అర్ధం చేసుకుని ఐపీఎల్ ఆడకపోవడమే కరెక్ట్ అన్నారు. లేకుంటే నల్ల బ్యాండ్లు కట్టుకొని మద్దతు ఇవ్వలని రజినీకాంత్ మీడియా ద్వారా వివరించారు.

Exit mobile version