‘రంగస్థలం’ ప్రభావంతో నెమ్మదించిన ‘ఛల్ మోహన్ రంగ’ !


‘రంగస్థలం’ సూపర్ హిట్ టాక్ తో నడుస్తున్న తరుణంలో నితిన్ 25వ చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’ ఏప్రిల్ 5న విడుదలైంది. పవన్ కళ్యాణ్ నిర్మాణం, త్రివిక్రమ్ కథ కావడంతో సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ దక్కగా మొదటి రోజే పాజిటివ్ టాక్ ను రావడంతో ‘రంగస్థలం’ రన్ ముందు వసూళ్లు కొంత తడబడ్డాయి.

తాజా సమాచారం మేరకు నైజాం ఏరియాలో సినిమా ఇప్పటికి వరకు రూ.2.49 కోట్ల షేర్ ను రాబట్టుకుందని తెలుస్తోంది. ఇరాక్ ఈ వారంలోనే నాని యొక్క ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం కూడ ఈ వారంలోనే విడుదలకానుండటం ఈ చిత్ర వసూళ్లు ఇంకొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు.

Exit mobile version