‘రంగస్థలం’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ ను దాటిపోయింది. 14న సినిమా విజయోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇకపోతే చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేస్తున్నారు. చరణ్ లేకుండానే ఒక షెడ్యూల్ పూర్తిచేసిన బోయపాటి మరో షెడ్యూల్ ను ఈ నెలాఖరు నుండి మొదలుపెడతారట.
ఈ షూట్లో చరణ్ కూడ పాల్గొనబోతున్నాడు. పవర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ సినిమాలో బోయపాటి స్టైల్ ఆఫ్ యాక్షన్ భారీ స్థాయిలోనే ఉంటుందట. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ కథానాయికగా వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
