కృష్ణా, గుంటూరు జిల్లాలో ‘భరత్ అనే నేను’ వసూళ్ల వివరాలు !


ఈ వేసవిలో పరిశ్రమకు దక్కిన మరొక విజయం ‘భరత్ అనే నేను’ రికార్డ్ స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసిందీ చిత్రం. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మొదటిరోజు రూ.1.92 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా ఆదివారం రోజున రూ.81 లక్షల షేర్ తో మొత్తంగా మూడు రోజులకు కలిపి రూ.3.37 కోట్లు అందుకుంది.

అలాగే గుంటూరు జిల్లాలో తొలిరోజు రూ.4.03 కోట్ల షేర్ ను కొల్లగొట్టిన ఈ సినిమా ఆదివారం రూ.86 లక్షలు వసూలు చేసి మూడు రోజులకు కలిపి రూ.5.57 కోట్ల షేర్ తో నాన్ బాహుబలి -2 రికార్డును కైవసం చేసుకుంది. ఇక కలెక్షన్లకు కీలకమైన మరొక జిల్లా తూర్పు గోదావరిలో మొదటి వారాంతానికి రూ.4.4 కోట్లను రాబట్టుకుందీ చిత్రం.

Exit mobile version