రాజమౌళి మల్టీ స్టారర్ సినిమాపై స్పందించిన రామ్ చరణ్ !


ఇటీవలే ‘రంగస్థలం’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాజమౌళితో కలిసి ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడ నటించనున్నాడు. ప్రస్తుతం ఈ మల్టీ స్టారర్ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగే అన్నదమ్ముల కథగా ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి.

తాజాగా జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించిన చరణ్ వాటిలో నిజం లేదని, సినిమా కథ వేరే ఉందని తేల్చి చెప్పేశారు. అంతేగాక ఎన్టీఆర్ తో కలిసి పనిచేయబోతుండటం నిజంగా ఎగ్జైటింగా ఉందని, త్వరలోనే రాజమౌళి తనకు, ఎన్టీఆర్ కు స్క్రిప్ట్ వినిపిస్తారని అన్నారు. ప్రస్తుతం చరణ్ బోయపాటి సినిమా చేస్తుండగా, ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తవగానే రాజమౌళి తన షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలున్నాయి.

Exit mobile version