మిలియన్ దిశగా దూసుకుపోతున్న ‘మహానటి’ !


నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ చిత్రం విశేషమైన ప్రేక్షకాదరణను పొందుతోంది. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో రెండు తరాల ప్రేక్షకులు సినిమాపై ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ప్రత్యేకమైన సినిమాలకు పట్టంకట్టే ఓవర్సీస్ ప్రేక్షకులు సైతం ‘మహానటి’కి బ్రహ్మరథం పడుతున్నారు.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రీమియర్ల ద్వారానే $303,456 లను వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటి వరకు 900,000 డాలర్లను ఖాతాలో వేసుకుని త్వరలో మిలియన్ మార్కును అందుకునే దిశగా వెళుతోంది. సినిమాకున్న డిమాండ్ మేరకు కొన్ని ఏరియాల్లో అదనపు షోలను ఏర్పాటు చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ లు నిర్మించారు.

Exit mobile version