‘చలో’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగశౌర్య తను నటిస్తున్న తరువాతి చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’ఫై మంచి అంచనాలే ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.
అమ్మమ్మగారిల్లు సినిమాని ఈ నెల 25కి విడుదల చేయన్నునారని సమాచారం . శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌ఫై కె.ఆర్ మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న అమ్మమ్మగారిల్లు చిత్రానికి సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాగశౌర్య సరసన బేబి షామిలి నటిస్తుంది .
ఇటీవల విడుదలైన అమ్మమ్మగారిల్లు టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది.మరి నాగశౌర్య ఈ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి .
