చివరికి నానికి ఫిక్సైన కొరటాల శివ !

వరుస హ్యాట్రిక్ విజయాలనందుకున్న దర్శకుడు కొరటాల శివ ఇటీవలే ‘భరత్ అనే నేను’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీంతో ఆయన తర్వాతి సినిమాను ఏ హీరోతో చేస్తారో చూడలని ఉత్సాహంగా ఉన్నారు ప్రేక్షకులు. ముందుగా అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోల పేర్లు వినబడినా అవేవీ వాస్తవాలు కాదని తేలిపోయింది.

ఇప్పుడు తాజాగా ఆయన యువ హీరో నానితో సినిమా చేస్తారనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన నానికి స్క్రిప్ట్ వినిపించారని, నాని కూడ కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొరటాల శివకు సన్నిహితుడు, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ నిర్మిస్తారని అంటున్నారు. ఇన్ని బలమైన వార్తలు వినిపిస్తున్నా కొరటాల శివ లేదా నానిల నుండి అధికారిక ప్రకటన వస్తేనే ఈ ప్రాజెక్ట్ ఖాయమో కాదో తేలుతుంది.

Exit mobile version