
‘మహానటి’ చిత్రంలో సావిత్రిగా అద్భుతమైన నటనను కనబర్చి అందరి ప్రశంసలు అందుకుని నటిగా గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది కీర్తి సురేష్. సినిమా విజయంలో ఆమె నటన ప్రధాన పాత్ర పోషించింది. అందుకే ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.
‘మహానటి’ చిత్రాన్ని తొలిరోజు వీక్షించిన రాజమౌళి సినిమాలో కీర్తి సురేష్ నటనకు బాగా ఇంప్రెస్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా తను చూసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో కీర్త్ సురేష్ నటన ఒకటని ప్రశంసించారు కూడ.
అందుకే తన మల్టీ స్టారర్ చిత్రంలో ఒక కథానాయకిగా ఆమెను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట జక్కన్న. అయితే ప్రస్తుతానికి ఒక వినికిడిగా మాత్రమే ఉన్న వార్తపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. ఇకపోతే రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ నుండి మొదలుపెట్టనున్నారు.