ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ ప్లేసులో కొనసాగుతున్న హీరోయిన్ ‘నయన తార’. ఆమె ఎంచుకునే కథలు ఆసక్తికరంగా ఉండీ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. గతంలోఆమె నటించిన ‘ఆరామ్’ చిత్రమే అందుకు నిదర్శనం .ఇప్పుడు మరొకసారి ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు . నయనతార నటిస్తున్నతాజా చిత్రం ‘కొలమావు కోకిల’ (కో కో ). ఈ సినిమాలో నయన తార డ్రగ్ పెడ్లర్ గా నటిస్తున్నారు .
ఆర్ధిక సమస్యల కారణంగా స్మగ్లింగ్ కు అలవాటుపడిన ఒక స్త్రీ కథతో తెరకేక్కుతుంది ఈ చిత్రం. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యోగిబాబు , శరణ్య పొన్నవన్ మొదలగువారు నటిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది
