శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించనున్న శ్రీ విష్ణు !

కథా బలం వున్నా సినిమాలను ఎంచుకుంటూ గుర్తుండి పోయే పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు శ్రీ విష్ణు .ఈయన ఇటీవల నటించిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’ విమర్శకుల ప్రశంసలు పొందింది . ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టింది .

తాజాగా శ్రీవిష్ణు ‘శర్వానంద్’ హీరో గా ‘శ్రీకాంత్ అడ్డాల’ తెరకెక్కించబోయే సినిమాలో నటించనున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఫై ‘అల్లు అరవింద్’నిర్మించనున్న ఈ సినిమాలో శర్వాకి బ్రదర్ గా నటించనున్నాడు శ్రీ విష్ణు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Exit mobile version