మూడు నెలల గ్యాప్ తర్వాత మొదలైన నాగ చైతన్య సినిమా !

అక్కినేని హీరో నాగ చైతన్య చేస్తున్న కొత్త సినిమాల్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ కూడ ఒకటి. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. చాలా నెలల క్రితం ఈ చిత్ర షూటింగ్ మొదలై కొంత చిత్రీకరణ జరుపుకుంది కానీ ఛందో మొండేటితో చేస్తున్న ‘సవ్యసాచి’ సినిమా కూడ సెట్స్ పై ఉండటంతో చాలా రోజులపాటు ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చారు నాగ చైతన్య.

సుమారు 3 నెలలకు పైగా గ్యాప్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ ఈరోజే తిరిగి మొదలైంది. కొద్దిరోజుల షూటింగ్ అనంతరం ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను విడుదలచేసే యోచనలో ఉన్నారు మారుతి. ఇందులో చైతూకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మారుతి గత చిత్రం ‘మహానుభావుడు’ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడ మంచి అంచనాలే ఉన్నాయి ప్రేక్షకుల్లో. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

Exit mobile version