యువ హీరో రాజ్ తరుణ్ చేసిన తాజా చిత్రం ‘రాజుగాడు’. గత సినిమాలు మూడు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రాజ్ తరుణ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రం పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా రూపొందిందని తెలుస్తోంది. హీరో రాజ్ తరుణ్ కూడ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ చిత్రం రెండు గంటల పాటు హ్యాపీగా చూడగలిగే సినిమాలు ఉంటుంది అన్నారు.
అలాగే సరదాగా కుటుంబంతో కలిసి చూసి నవ్వుకుంటూ బయటికి రావచ్చని అన్నారు. దర్శకురాలు సంజన రెడ్డి కూడ ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, రెగ్యులర్ అంశాలతో బోర్ కొట్టి ఉన్న ప్రేక్షకులకు ఇదొక మంచి రిలీజ్ అని అన్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మతమైన ఈ చిత్రాన్ని జూలై 1వ తేదీన విడుదలచేయనున్నారు.
