ఇమ్రాన్ హష్మి సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇవ్వనున్న సౌత్ హీరోయిన్ !

దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్ ప్రయత్నాలు చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే కొందరు కథానాయికలు హిందీలోకి ప్రవేశించగా ఇప్పుడు మరొక ప్రముఖ హీరోయిన్ వేదిక కూడ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. అది కూడ ఇమ్రాన్ హష్మి సినిమాతో కావడం విశేషం. ఈ చిత్రాన్ని మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేయనున్నారు.

రిషి కపూర్ కూడ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘ది బాడీ’ అనే టైటిల్ నిర్ణయించినట్టు సమాచారం. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సునీర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దక్షిణాదిన తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన వేదిక తెలుగులో ‘బాణం, దగ్గరగా దూరంగా’ వంటి చిత్రాల్లో నటించారు.

Exit mobile version