విడుదలకు సిద్దమైన దర్శకుడు చంద్ర సిద్దార్థ సినిమా !


ఒకప్పుడు ‘ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు చంద్ర సిద్దార్థ. అప్పట్లో ఈయన సినిమాలంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉండేది ప్రేక్షకుల్లో. కానీ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూడటంతో ఆయన కొంచెం వెనుకబడ్డారు. 2014లో విడుదలైన ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా ‘ఆటగదరా శివ’.

దాదాపు అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమా ఈ నెలలోనే విడుదలకానుంది. త్వరలోనే చిత్ర టీజర్ ను విడుదలచేయనున్నారు టీమ్. ‘భజరంగీ భాయీజాన్, లింగ’ వంటి సినిమాల్ని నిర్మించిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version