సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘భరత్ అనే నేను’ తెలుగునాట ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రం ‘భరత్ ఎనుమ్ నాన్’ పేరుతో తమిళ భాషలో గత నెల31న విడుదలై అక్కడ మంచి వసూళ్లను రాబడుతోంది.
ఈ చిత్రం తమిళనాడులో నాలుగు రోజులకు గాను సుమారు కోటి రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని సమాచారం. ఫుల్ రన్లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ని ఖాతాలో వేసుకోనుంది. ఇదివరకే విడుదలైన తెలుగు వెర్షన్ అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు చిత్రంగా రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కైరా అధ్వాని కథానాయికగా నటించింది.
