సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం కలెక్షన్స్ పరంగానే కాదు శాటిలైట్ రైట్స్ విషయంలోను రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ రూ.22కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ శాటిలైట్ రైట్స్ విషయం ఫై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ‘బాహుబలి’ సినిమా తరువాత అత్యధిక ధరకు అమ్ముడైన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించనుంది ఈ చిత్రం.
గతంలో బాహుబలి హిందీ శాటిలైట్ హక్కులు రూ .51కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు సౌత్ సినిమాల్లో ఇదే హైయెస్ట్. కాగా మహేష్ బాబు నటించిన సినిమాలు హిందీలో బుల్లితెరఫై మంచి రేటింగ్స్ సాధిస్తుంటాయి. అందుకే ‘భరత్ అనే నేను’ చిత్రానికి ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేశారని అంటున్నారు.
