శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి విరాటపర్వం 1992 !

‘నీది నాది ఒకే కథ’ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో.. శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా నటించబోతున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. వేణు ఉడుగుల తన రెండో చిత్రంగా ఈ పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 1990ల నేప‌థ్యంలో సాగే ఈ చిత్ర క‌థ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుందట. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయానికీ హత్తుకున్నేలా చాలా ఎమోషనల్ గా ఉంటాయని సమాచారం.
ఇప్ప‌టికే శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి హను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో ‘ప‌డిప‌డి లేచే మ‌న‌సు’ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం టాకీపార్ట్ కూడా త్వరలోనే పూర్తి కానుంది. మళ్ళీ ‘విరాటపర్వం 1992’ కోసం ఈ జంట కలిసి నటించనున్నారు.

Exit mobile version