‘ఈ నగరానికి ఏమైంది ? ట్రైలర్ వచ్చేసింది

“పెళ్లిచూపులు” ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్ కొత్త నటీనటులతో ‘ఈ నగరానికి ఏమైంది ?’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. తరుణ్ భాస్కర్ శైలి మేకింగ్ లోనే ఈ ట్రైలర్ కూడా ఆసక్తిగా ఉంది. ‘పెళ్లిచూపులు’లాగే ఈ చిత్రం కూడా స్నేహితుల మధ్య జరిగే లవ్ తో కూడుకున్న కామెడీ ఎంటర్ టైనర్ గా తెలుస్తోంది. అయితే ప్రముఖ నటుడు రానా పై పోస్టర్ ను ట్వీట్ చేస్తూ ఆల్ రెడీ వన్ లాక్ వ్యూస్ ను ఈ చిత్రం సాంతం చేసుకుందని కామెంట్ చేశారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. కథతో పాటు స్క్రీన్ ప్లే దర్శకత్వ బాధ్యతలు కూడా తరుణ్ భాస్కరే నిర్వహిస్తున్నారు. ‘పెళ్లిచూపులు’ చిత్రం లాగే ఈ చిత్రం కూడా అందరూ కొత్తవారితోనే తెరకెక్కుతుంది. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం కూడా తరుణ్ గత చిత్రంలాగే భారీ విజయం సాధించేలా ఉంది. త్వరలో ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version