కాలా తరువాత అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తున్న తెలుగు నటి !

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా చిత్రం ఇటీవలే రిలీజ్ అయింది. ఈ సినిమా లో రజినీకాంత్ భార్యగా ఈశ్వరీ రావు నటించారు. ఈ చిత్రంలో ఈమె నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి .తాజాగా ఈమె తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ‘వర్మ’ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు . ఈ సినిమాతో చియాన్ విక్రమ్ తనుయుడు ధృవ్ హీరోగా పరచియం అవుతున్నాడు .

ఇక ఈశ్వరీ రావు సౌత్ లో నాలుగు భాషల్లో నటించింది. స్వతహాగా తెలుగు నటి అయిన ఈవిడ ఎక్కువగా తెలుగు సినిమాల్లో కనిపించింది . నేను లోకల్ ,అ ఆ ,బ్రహ్మోత్సవం ,లెజెండ్ వంటి తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

Exit mobile version